నా చితికి నిప్పంటించాను ,
కట్టె కట్టెను కాలుస్తోంది ,
కదిలిస్తోంది ,కరిగిస్తోంది
కనుమరుగు చేస్తోంది
దేహం దగ్ధ మయ్యాక
నాకంటూ ఏముంది
బతుకు నిండిన
వెతుకులాటలు
వెతల కధలు
మట్టి మాటున
దాగు తున్నాయి
మిగిలిందేమిటి
చివరికి
తెలిసేనా
అసలు నిజం
జీవనం నిలిచిందా
మరణం గెలిచిందా
నిలబడటం జీవనం
కొనసాగింపు మరణం