27, నవంబర్ 2009, శుక్రవారం

మెట్ట వేదాంతం

***
అలుపెరుగని పరుగు
అవనతం కాని శిరసు
ఒకటైనా నిలచిందా
ఈ నేలపై ఎపుడైనా
***
ఒకింత వేకువ కోసం
మరింత వెన్నెల కోసం
తెలియని వెతుకులాట
వేడుకైయ్యింది ఈ బతుకున
***
జీవన సంద్రపు
అలల తాకిడికి
కలల ఇసుకగూళ్ళు
కనుమరుగౌతున్నాయి
***